: అందుకే ఆస్పత్రిలో నిద్రపోయా: టీఎస్ మంత్రి రాజయ్య


సర్కారు దవాఖానాల్లో రోగులు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారని, వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య వెల్లడించారు. ఆస్పత్రుల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో నర్సుల కొరత తీవ్రంగా ఉందని, సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రాజయ్య తెలిపారు. కాగా, నేటి ఉదయం రాజయ్య ఆస్పత్రి నుంచి తన వాహన కాన్వాయితో బయలుదేరగా, ఉస్మానియా వద్ద ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా జీతాలు అందడం లేదని వారు వాపోయారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తానని రాజయ్య కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News