: ఎర్రచందనం విక్రయం ద్వారా ఏపీకి రూ. 991 కోట్ల ఆదాయం
ఎర్రచందనం వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 991 కోట్ల ఆదాయం లభించింది. ఎర్రచందనం స్మగ్లర్ల ద్వారా పట్టుబడిన దుంగల వేలంపై సుదీర్ఘకాలంగా కొనసాగిన సందిగ్ధతకు సుప్రీంకోర్టు ఇటీవలే తెర దించింది. సుప్రీం పచ్చజెండాతో వెనువెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు సర్కారు ఎర్రచందనం దుంగల వేలానికి రంగం సిద్ధం చేసింది. ఆన్ లైన్ లో ఈ-వేలం పద్ధతి ద్వారా చేపట్టిన సర్కారీ వేలానికి బిడ్డర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. సోమవారం రాత్రితో తొలి దశ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 3,615 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను ప్రభుత్వం విక్రయించింది. దేశీయ కొనుగోలుదారులే కాక అంతర్జాతీయ బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలంలో ప్రభుత్వానికి రూ.991 కోట్ల ఆదాయం సమకూరింది.