: రుణమాఫీ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ
తెలుగు రాష్ట్రాలు ప్రకటించిన రుణమాఫీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ విషయంపై దాఖలైన రెండు పిటిషన్లపై తాము విచారణ జరిపామన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, మంగళవారం తాజా పిటిషన్ పై ఆదేశాలు జారీ చేస్తామని సోమవారం వెల్లడించారు. సోమవారం నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం సంధించిన ప్రశ్నలకు పిటిషనర్ రామమోహన్ చౌదరి సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతో జస్టిస్ గుప్తా అసహనం వ్యక్తం చేశారు.