: మా దేశంలో పరిశ్రమలు స్థాపించండి: తెలుగు పారిశ్రామికవేత్తలకు అమెరికా ఆహ్వానం


ఓవైపు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు స్థాపించండి అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతుంటే... మరోవైపు అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే దారిని అనుసరిస్తోంది. మా దేశంలో పరిశ్రమలు స్థాపించండి, అన్ని విధాలా సహకరిస్తామని ఊరిస్తోంది. నిన్న హైదరాబాదులో ఏపీ, తెలంగాణకు చెందిన ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్ కాన్సులర్ చీఫ్ జామిసన్ పోయస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామాల భేటీ ఇరు దేశాల పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. తెలుగు పారిశ్రామిక వేత్తలు అమెరికాలో పరిశ్రమలను స్థాపించాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలకు అమెరికా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News