: ఈ నెల 6న పాస్ పోర్ట్ మేళా


హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ నెల 6న పాస్ పోర్ట్ మేళా జరగనుంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అమీర్ పేట్, బేగంపేట, టోలిచౌకి, తిరుపతి, విజయవాడ, నిజామాబాద్ లలో ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో మేళా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తత్కాల్ దరఖాస్తులు స్వీకరించరు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిశీలన కూడా ఉండదు. కేవలం సాధారణ, రెన్యువల్ పాస్ పోర్ట్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటారు. దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 3న అపాయింట్ మెంట్లను www.passportindia.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.

  • Loading...

More Telugu News