: సర్కారీ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యమే లక్ష్యం: ఆస్పత్రి నిద్రలో తెలంగాణ ఆరోగ్య మంత్రి


ప్రభుత్వాస్పత్రుల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఆస్పత్రి నిద్ర పేరిట ఆయన సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం దాకా హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో బస చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా సర్కారీ వైద్యాలయాలను మెరుగుపరచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా సర్కారీ దవాఖానాలకు ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తోందన్నారు. ఒక్క ఉస్మానియా ఆస్పత్రికే ఇటీవల రూ. 100 కోట్ల రూపాయలను విడుదల చేశామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ వైద్యాలయాల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలను 30 శాతం నుంచి 60 శాతం వరకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. తద్వారా ఆస్పత్రుల అభివృద్ధికి నిధుల లభ్యతే కాక చికిత్సల్లో పాలుపంచుకున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఇన్సెంటివ్ లు కూడా అందుతాయన్నారు.

  • Loading...

More Telugu News