: తుపాను బాధితులకు 'కాంకార్' విరాళం కోటి
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం కంటెయినర్ కార్పోరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (కాంకార్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందజేసింది. సదరు సంస్థ సౌత్ సెంట్రల్ రీజియన్ డైరెక్టర్ వి. కళ్యాణ్ రామ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలసి కోటి రూపాయల చెక్కును అందజేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.