: విడాకులకు కోర్టును ఆశ్రయించిన సినీ దర్శకుడు, నటి


ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, వెటరన్ హీరోయిన్ లిజి దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు నటి లిజి ఓ ప్రకటన విడుదల చేశారు. 1996లో ప్రేమ వివాహం చేసుకున్న లిజి, ప్రియదర్శన్ కు కల్యాణి, సిద్ధార్థ్ అనే పిల్లలున్నారు, వారిద్దరూ విదేశాల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. కాగా, తమ ఎడబాటు గురించి తమ పిల్లలు, సన్నిహితులకు తెలుసని ఆమె స్పష్టం చేశారు. తమ జీవితంలో ఇది క్లిష్ట సమయమని, తమ ఏకాంతాన్ని గౌరవించాలని ఆమె మీడియాను కోరారు. ప్రియదర్శన్, లిజి దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని, వారు విడిపోనున్నారని గతంలో మీడియా వార్తలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో వారి వైవాహిక జీవితంపై ఎన్నో కథనాలు మీడియా ప్రసారం చేసింది. అప్పట్లో కమల్ హాసన్-గౌతమి, మోహన్ లాల్-ఆయన భార్య చొరవతో కొన్నాళ్ల పాటు కలిసున్న వీరు ఎట్టకేలకు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News