: అక్కడ దాడిచేస్తే...ఇక్కడ లొంగిపోయారు!
ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడికి దిగితే, ఆంధ్రప్రదేశ్ లోని మిలీషియా సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారు. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలకు చెందిన 17 మంది మిలీషియా సభ్యులు రంపచోడవరంలో ఎస్పీ రవిప్రకాశ్ ఎదుట లొంగిపోయారు. ఉద్యమబాట నుంచి తప్పుకుని, ప్రశాంతమైన జీవనం గడపాలని నిర్ణయించుకుని లొంగిపోయినట్టు వారు వివరించారు.