: సినీ పరిశ్రమ స్పందన అద్వితీయం: అయ్యన్నపాత్రుడు
హుదూద్ బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ పడిన తపన అద్వితీయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు అభినందించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడూ బిజీ షెడ్యూళ్లతో సతమతమయ్యే సినీ నటులు రెండు రోజులపాటు తుపాను బాధితులను ఆదుకునేందుకు వెచ్చించడం అభినందనీయమని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలిచి, రెండు రోజులు శ్రమపడి 11.51 కోట్ల రూపాయల విరాళాలు సేకరించిందని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ సహాయం మరువలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.