: మావోయిస్టుల మెరుపుదాడి...13 మంది జవాన్ల మృతి!
ఛత్తీస్ గఢ్ లో దారుణం చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్న మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. ఫలితంగా 13 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సుకుమా జిల్లా చింతగుప్పలో మావోయిస్టులు అంబుష్ ఎటాక్ కు దిగారు. సార్వత్రిక ఎన్నికల్లో విరుచుకుపడతారని ఇంటెలిజెన్స్ విభాగాలు భావించినా, ఎలాంటి హింసకు పాల్పడని మావోయిస్టులు, అందరూ ఆదమరచిన వేళ కాపుకాచి దాడిచేశారు. దీంతో, ఇద్దరు అధికారులు సహా 13 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.