: ఎన్నిసార్లు తల నరుక్కుంటావ్ కేసీఆర్?: రాజనర్సింహ సూటిప్రశ్న
ప్రతి దానికి తల నరుక్కుంటాననడం కేసీఆర్ కు అలవాటైపోయిందని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ వ్యంగ్యం ప్రదర్శించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, "తెలంగాణకు దళితుడినే సీఎం చేస్తానన్నావ్, లేకుంటే తల నరుక్కుంటానన్నావ్. అసలు నువ్వు ఎన్నిసార్లు తల నరుక్కుంటావ్?" అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనూ, అంతకుముందు ఉద్యమ సమయంలోనూ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కేసీఆర్ నెరవేర్చలేదని రాజనర్సింహ విమర్శించారు.