: హైటెక్ కాపీయింగ్ జరిగింది... కానీ, పరీక్షను రద్దు చేయడం కుదరదు: రైల్వే సీపీఆర్వో
రైల్వే నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్ జరిగినప్పటికీ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించడం కుదరదని రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మాస్ కాపీయింగ్ పై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. సుమారు 3.91లక్షల మంది నిరుద్యోగులు ఆర్ఆర్బీ పరీక్షలు రాశారని ఆయన వెల్లడించారు. పరీక్షా పత్రం లీకేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి హస్తముందని భావిస్తున్నామని, విచారణ తరువాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.