: భక్తులపైకి దూసుకెళ్లిన కారు... మహిళ మృతి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం సంభవించింది. శ్రీకాళహస్తీశ్వరుని దేవాలయానికి సమీపంలో భక్తులపై నుంచి ఓ కారు దూసుకుపోయింది. భక్తులు నడుస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కారును వేగంగా నడిపారు. ఈ క్రమంలో కారు పలువురు భక్తులను ఢీ కొంటూ ముందుకు సాగిపోయింది. ఓ మహిళను బలంగా ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. గాయాలు బలంగా తగలడంతో వారి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భక్తులను ఢీకొన్న కారు కనీసం ఆగకుండా వెళ్లిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.