: తగ్గిన రాయితీలేని వంటగ్యాస్ సిలిండర్ ధర
రాయితీలేని వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఎల్పీజీ సిలిండర్ పై రూ.113 తగ్గించినట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయ ముడి చమురు రేట్లు చాలా సంవత్సరాల తరువాత అత్యల్ప స్థాయికి తగ్గిన నేపథ్యంలో సిలిండర్ ధర దిగొచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీలో 14.2 కేజీల రాయితీలేని సిలిండర్ ఇక నుంచి రూ.752 ధర ఉంటుంది. అంతకుముందు, సిలిండర్ కు రూ.865 చెల్లించాల్సి వచ్చేది. ఆగస్టు తరువాత రాయితీలేని వంటగ్యాస్ ధర తగ్గడం ఇది ఐదవసారి.