: ఐఫోన్ కోసం ఆరేళ్ళ చిన్నారిని హత్యచేసిన దుర్మార్గుడు


ఐఫోన్ కొనుక్కోవాలన్న కోరికను తీర్చుకోవడం కోసం ఆరేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో ఆ చిన్నారిని హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లీలోని రజత్ నగర్ లో చోటుచేసుకుంది. తోపుడుబండిపై పండ్ల వ్యాపారం చేసుకొనే వ్యక్తి కొడుకు గణేష్ (6) ఆడుకోవడం కోసం ఇంట్లోంచి బయటకి వెళ్ళి తిరిగి రాలేదు. సాయంత్రానికి, గణేష్‌ని కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాలని ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని గణేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు స్పందించి రంగంలోకి దిగేసరికి దారుణం జరిగిపోయింది. ఆ ప్రాంతంలోని ఒక పార్క్‌లో గణేష్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అంతకుముందు గణేష్ అదే పార్క్‌లో వాళ్ళ ఇంటి సమీపంలో నివసించే మరో యువకుడితో కనిపించాడని కొందరు చెప్పారు. దీంతో, పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, గణేష్‌ని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. హత్యకు గల కారణాన్ని నిందితుడి నోటి నుంచి విని పోలీసులే విస్తుపోయారు. తనకు ఎప్పటి నుంచో ఐఫోన్ కొనుక్కోవాలని ఉండేదని, ఆ కోరిక తీర్చుకోవడం కోసమే గణేష్‌ని కిడ్నాప్ చేశానని, రూ.1.5 లక్షలు కావాలని ఫోన్ చేశానని, ఆ తర్వాత తన వ్యవహారం బయటపడిపోతుందన్న భయంతో గణేష్‌ని హతమార్చానని తెలిపాడు.

  • Loading...

More Telugu News