: కృష్ణ నీళ్లను మళ్లీ పంచండి... సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ
కృష్ణా ట్రైబ్యునల్ జరిపిన నీటి కేటాయింపులు సక్రమంగా లేవని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, కేటాయింపుల ప్రక్రియ మళ్లీ చేపట్టాలని కోరింది. కాగా, ఈ పిటిషన్ విచారణ అర్హతపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కేసు విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.