: కావాలంటే ఏపీలో కూడా ఇంటర్ పరీక్షలను మేమే నిర్వహిస్తాం: టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంటర్ పరీక్షల వివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇంటర్ బోర్డుకు టీఎస్ విద్యాశాఖ మంత్రినే ఛైర్మన్ గా ఉండమనండి, తాను వైస్ ఛైర్మన్ గా ఉంటానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రతిపాదనకు జగదీష్ రెడ్డి నో చెప్పారు. చట్టరీత్యా ఇంటర్ బోర్డులో ఉపాధ్యక్ష పదవి లేనందున ఏపీ మంత్రికి అవకాశం ఉండదని అన్నారు. కావాలంటే ఏపీలో కూడా ఇంటర్ పరీక్షలను తామే నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తోందని, విద్యార్థుల్లో అయోమయం నెలకొనేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News