: రుణమాఫీకి బ్యాంకులు ముందుకొస్తే మీకేంటి అభ్యంతరం?: పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చేపట్టిన రైతు రుణమాఫీపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రుణమాఫీని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన హైకోర్టు... రెండు రాష్ట్రాలు అమలు చేస్తున్న రుణమాఫీ పథకానికి సాయం చేయడానికి బ్యాంకులు ముందుకొస్తుంటే మీకేంటి అభ్యంతరం అంటూ పిటిషనర్ ను ప్రశ్నించింది. దీనిపై మీకున్న అభ్యంతరాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News