: బీఎస్ఎఫ్ సేవలను కొనియాడిన ప్రధాని


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. సరిహద్దుల్లో మొక్కవోని ధైర్యంతో, అవిశ్రాంతంగా దేశ భద్రత కోసం పాటుపడుతున్నారంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. బీఎస్ఎఫ్ 49వ 'రైజింగ్ డే' సందర్భంగా మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు. "రైజింగ్ డే సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి మనం సెల్యూట్ చేయాలి. వారి తెగువ, అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమే" అని పేర్కొన్నారు. 1965 డిసెంబర్ 1న ఏర్పడిన బీఎస్ఎఫ్ దేశ సరిహద్దుల్లో రాజీలేని పోరాటం చేస్తోంది. బీఎస్ఎఫ్ ప్రపంచంలోనే అతి పెద్ద సరిహద్దు భద్రతాదళం.

  • Loading...

More Telugu News