: బాబ్లీ కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయింపు


బాబ్లీ జలాల కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయించింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బాబ్లీ మానిటరింగ్ కమిటీలో చేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే, మానిటరింగ్ కమిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ ను తొలగించాలని ప్రభుత్వం పేర్కొంది. అటు గోదావరి జలాలు వాడుకుంటున్నందున తమను కూడా కమిటీలో ఉంచాలని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ మేరకు పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం, కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News