: నోయిడా ఇంజనీరు లాకర్లలో కోట్ల విలువచేసే వజ్రాలు స్వాధీనం


ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదవ్ సింగ్ అనే ఇంజినీరుకు చెందిన 12 బ్యాంకు లాకర్లను ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ ఉదయం తెరిచారు. లాకర్ల నుంచి రూ.100 కోట్లకు పైగా విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు రెండు కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదును కూడా స్వాధీన పరుచుకున్నారు. రెండు రోజుల కిందట యాదవ్ నివాసం, కార్యాలయాల్లో అధికారులు ఒకే సమయంలో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో రూ.90 లక్షల ఆడి కారును గుర్తించారు. అంతేగాక పార్క్ చేసిన కారులో ఎనిమిది సంచుల్లో నగదును సర్ది ఉంచడం గమనార్హం. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ ఇంజినీరు ఓసారి పదవి నుంచి సస్పెండ్ కూడా అయ్యారు.

  • Loading...

More Telugu News