: భారత నావికాదళ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చంద్రబాబు


ఈ నెల 4న భారత నావికాదళ ఉత్సవం విశాఖలో జరగనుంది. 1971లో పాకిస్థాన్ పై భారత నావికాదళం విజయబావుటా ఎగురవేసింది. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా విశాఖ సాగర తీరాన 'విక్టరీ ఎట్ సీ' కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ నిర్వహిస్తోంది. ఈ ఉత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆరోజున సముద్రంలో 20 యుద్ధ నౌకలు, 23 ఎయిర్ క్రాఫ్టులతో విన్యాసాలను ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ రేపు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News