: హైవేపై దోపీడీ దొంగల బీభత్సం
జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట నుంచి వనపర్తి వెళ్ళే దారిలోని గుంపుగట్టు దగ్గర ఒక కారుపై దాడి చేశారు. కారులో ఉన్న వారిని గాయపరిచి వారివద్ద ఉన్న నగదు లాక్కున్నారు. అదే దారిలో వస్తున్న ఓ అంబులెన్సుపై కూడా దాడి చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు గాయపడినట్టు తెలుస్తోంది. కర్రలు, రాళ్ళు ఉపయోగించి ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం.