: నేటి నుంచి పోస్టాఫీసుల్లో శ్రీవారి దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. నేటి నుంచి ఏపీ, తెలంగాణల్లోని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో శ్రీవారి దర్శన టికెట్లను విక్రయించనున్నారు. రూ. 300 విలువగల ప్రత్యేక దర్శనం టికెట్లు తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి రానున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లోని 9 పోస్టాఫీసుల్లో టికెట్లను విక్రయిస్తారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రెండు పోస్టాఫీసులు, కృష్ణా జిల్లా గుడివాడ, నందిగామ, వరంగల్ జిల్లాలోని జనగాం, నర్సంపేట పోస్టాఫీసుల్లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టికెట్లను విక్రయిస్తారు.