: ఈ నెల 8 నుంచి తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర
వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల చేపడుతున్న తెలంగాణ యాత్రకు రంగం సిద్ధమైంది. 'పరామర్శ యాత్ర' పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఈ యాత్ర మొదలై... జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన 18 మంది కుటుంబాలను యాత్ర సందర్భంగా షర్మిల పరామర్శిస్తారు. పోస్టర్ విడుదల సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రాజకీయ యాత్ర కాదని తెలిపారు. దళిత, మైనార్టీ, రైతు కుటుంబాలకు షర్మిల మనోధైర్యం కలిగిస్తారని చెప్పారు. తమ పాలన ఇంకా మొదలు కాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని... అందుకే రాజకీయ విమర్శల జోలికి వెళ్లదలుచుకోలేదని వెల్లడించారు.