: జనవరి 1ని సెలవుగా ప్రకటించండి: నేషనల్ కాంగ్రెస్ ఆప్ ఇండియన్ క్రిస్టియన్స్
జనవరి 1ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ రోజు సెలవు ప్రకటించాలని నేషనల్ కాంగ్రెస్ ఆప్ ఇండియన్ క్రిస్టియన్స్ అధ్యక్షుడు సీఏ డానియేలు ఆడమ్స్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 1ని సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇఫ్తార్ విందు మాదిరే క్రైస్తవులకు క్రిస్మస్ విందును ఇవ్వాలన్న తమ అభ్యర్థనకు గతంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. క్రిస్మస్ ఉత్సవాల నిర్వహణకు రెండు ప్రభుత్వాలు రూ.15 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.