: వెంకీ... ఇంత పని చేస్తావా?: చిరంజీవి


మేము సైతం కార్యక్రమంలో తమాషా సంఘటన చోటుచేసుకుంది. దేవీశ్రీప్రసాద్ ఆట,పాటలతో ఉల్లాస పరుస్తున్నప్పుడు సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని సహనటుడు వెంకటేష్ స్టేజ్ పైకి తీసుకుని వెళ్లాడు. వెంకీకి మరోనటుడు రవితేజ వంతపాడి చిరంజీవిని స్టేజ్ మీదికి తీసుకెళ్లాడు. దీంతో స్టేజ్ మీదికెళ్లిన మెగాస్టార్ కు డాన్స్ చేయక తప్పలేదు. దీంతో ఎప్పుడో రాజకీయాలకు వెళ్లక ముందు వేసిన డాన్సులు ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తురావని చెప్పినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. దేవీ పాటందుకున్నాడు, చిరు మాత్రం లయ అందుకోలేదు. ఇంతలో అల్లు అర్జున్ వచ్చి మామలో ఉత్సాహం నింపాడు. దీంతో చిరంజీవి స్టెప్పులేశారు. ఆయన స్టెప్పులేయడం పూర్తయ్యాక...'వెంకీ ఇంత పని చేస్తావా? నువ్వే నాతో డాన్స్ చేయించా'వని ముద్దుగా ఆక్షేపించారు. 'ఏం పర్లేదు, అంతా మంచికే' అని వెంకీ నవ్వేశారు.

  • Loading...

More Telugu News