: సినీ పరిశ్రమ మేము సైతం విరాళం మొత్తం 11,51,56,116 రూపాయలు


సినీ పరిశ్రమ 'మేము సైతం' అంటూ 'హుదూద్' బాధితులకు అండగా నిలిచేందుకు నిర్వహించిన కార్యక్రమం ద్వారా సుమారు 11,51,56,116 రూపాయలను సేకరించారు. ఈ భూరి విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అందజేశారు. దీనితో పాటు జెమినీ, సన్ నెట్ వర్క్ విరాళం 3.5 కోట్ల రూపాయలు అందజేసింది. హిందూపురం నియోజకవర్గం ప్రజలు వసూలు చేసిన 43,00,000 రూపాయలు ఎమ్మెల్యే బాలయ్య ద్వారా అందజేశారు. అలాగే మన బాలయ్య.కామ్ ద్వారా 1, 11,111 రూపాయల విరాళం అందజేశారు. బిగ్ సీ సంస్థ అందజేసిన విరాళం 15 లక్షల రూపాయలు అందజేశారు. మలబార్ జ్యుయలర్స్ 13 లక్షల రూపాయలు విరాళం అందజేసింది. డీఎస్ మేక్స్, ఆసరా ఫౌండేషన్ 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేసి తమ పెద్దమనసును చాటి చెప్పాయి.

  • Loading...

More Telugu News