: కీపింగ్ లో ఇరగదీసిన రాంచరణ్...వెంకీ సిక్సుల వర్షం
'మేము సైతం' అంటూ హైదరాబాదు, యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండవ క్రికెట్ మ్యాచ్ లో రెండు జట్ల కెప్టెన్లు వెంకటేష్, రాంచరణ్ షో నడిచింది. బ్యాటింగ్ ప్రారంభించిన వెంకీ నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ బాది అభిమానులను అలరించి, రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగారు. ఫీల్డింగ్ లో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రాంచరణ్ కీపింగ్ చేస్తూ, మూడు అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ లు పట్టి అభిమానులను అలరించాడు. దీంతో స్టేడియంలో హర్షధ్వానాలు మిన్నంటాయి.