: దీనికి స్ట్రేటజీ అవసరమా?...ఎంజాయ్ చెయ్!: వెంకటేష్
జంటిల్మన్ గేమ్ క్రికెట్ ఎక్కడ జరిగినా ప్రత్యక్షమయ్యే ఏకైక హీరో వెంకటేష్, హైదరాబాదులో జరుగుతున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం రోజు మొత్తం కేటాయించారు. సినీ పరిశ్రమ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్ ఆటగాళ్లను, కళాకారులను ప్రోత్సహిస్తూ అలరించారు. సందడి చేస్తున్న వెంకటేష్ వద్దకు వచ్చిన వ్యాఖ్యాత ప్రదీప్ 'సార్... మీ స్ట్రేటజీ ఏంటి?' అని అడిగాడు. దీనిపై స్పందించిన వెంకీ, 'దీనికి స్ట్రేటజీ ఏంటి ప్రదీప్? ఆటను ఎంజాయ్ చెయ్' అన్నారు. దీంతో బుద్ధిమంతుడిలా ప్రదీప్ 'అలాగే సర్' అన్నాడు. తుపాను బాధితులకు సినీ పరిశ్రమ అండగా నిలబడడం హర్షణీయమని అభిప్రాయపడ్డాడు.