: 'మేము' సైతం కబడ్డీ జట్టు విజేత మంచు మనోజ్ టీం
'హుదూద్' బాధితుల కోసం హైదరాబాదులో సినీ తారలు నిర్వహిస్తున్న 'మేము సైతం' కబడ్డీ ఆట విజేతగా మంచు మనోజ్ జట్టు నిలిచింది. మనోజ్ జట్టు 26 పాంయిట్లు సాధించగా, విష్ణు జట్టు 22 పాయింట్లు సాధించింది. బ్రహ్మానందం ఆటను సీరియస్ గా తీసుకోలేదని, ఆయనకు డిసిప్లిన్ లేదని రిఫరీ మోహన్ బాబు ప్రకటించి, రెండు పాయింట్లు తగ్గించారు. దీంతో 24 పాయింట్లు సాధించిన మనోజ్ జట్టు విజేతగా నిలిచింది. ఆటలో బ్రహ్మానందం, అలీ, మనోజ్, విష్ణు, నాని, అల్లరి నరేష్ తదితరులు కనువిందు చేశారు.