: సిగ్గేసింది...గర్వంగా ఉంది: జూనియర్ ఎన్టీఆర్


గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తాను 'మేము సైతం'లో పాల్గోలేనని అనుకున్నానని హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. హైదరాబాదులోని యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం నుంచి సినీ పరిశ్రమ పడుతున్న తపన చూసి తనకు సిగ్గేసిందని అన్నారు. హుదూద్ బాధితులకు నిధులు సమకూర్చే కార్యక్రమంలో భాగం అయినందుకు గర్వంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన తాతగారు జోలెపట్టి ప్రజలకు అండగా ఉండడం నేర్పారని చెప్పిన ఆయన, అదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నామని అన్నారు. సినీ అభిమానుల నుంచి టికెట్ల రూపేణా తీసుకోవడమే కాకుండా, అభిమానులకు ఇలా సహాయ పడుతున్నందుకు ఆనందంగా ఉందని, అందుకు జ్వరంతో కూడా తానీ కార్యక్రమంలో భాగమయ్యేందుకు వచ్చానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News