: సింధు ఖాతాలో మకావు టైటిల్


మకావు ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్ ను తెలుగుతేజం పి.వి.సింధు మరోసారి కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-12, 21-17 తేడాతో దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ హో మిన్ ను మట్టికరపించి టైటిల్ సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సింధు తనకు మకావులో తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. టోర్నీ ఆరంభం నుంచి తిరుగులేని ఆటతీరుతో టైటిల్ వేటకు సింధు అవకాశాలు మెరుగుపరచుకుంది. ఫైనల్ లో వరుస రెండు సెట్లలో తిరుగులేని ఆధిక్యం సాధించిన సింధు, ప్రపంచ 91 ర్యాంక్ క్రీడాకారిణి కిమ్ కు చుక్కలు చూపించి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది.

  • Loading...

More Telugu News