: విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఇంటి వద్ద హై డ్రామా
తమకు ప్లాట్లు అమ్ముతానంటూ విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల రూ.50 వేల నుంచి 20 లక్షల రూపాయల వరకూ వసూలు చేసిందని ఆరోపిస్తూ, పలువురు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో శకుంతల ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆమె బయటికి రావాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.