: 'మేము సైతం'లో బాలయ్య పాట కచేరి
పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చెప్పే నందమూరి బాలకృష్ణ పాటలు పాడితే ఎలా వుంటుందో చూడాలని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా, వారి కోరికను బాలయ్య బాబు తీర్చారు. ఇంతవరకూ, సినిమాల్లో పాటలు పాడే ప్రయత్నం చేయని బాలకృష్ణ 'మేము సైతం' వేదకపై అదరగొట్టారు. గాయని కౌసల్యతో కలసి ఒక పాట, మాళవికతో కలసి ఒక పాట పాడారు. కార్యక్రమానికి వచ్చిన చిత్ర పరిశ్రమ ప్రముఖులు కేకలు, విజిల్స్ వేసి బాలకృష్ణను ఉత్సాహపరిచారు.