: ఒబామా ప్రసంగిస్తుంటే బోర్ గా ఫీలైన ఆయన కుమార్తెలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుంటే, పక్కనే నిలబడి ఉన్న ఆయన కుమార్తెలు మాలియా, సాషాల ముఖాల్లో చెప్పలేనంత విసుగు, చిరాకు కనిపిస్తే ఎలా ఉంటుంది? కూతుళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ఒబామా చూడకపోయినా ఎదురుగా ఉన్నవారికి కనిపించాయి. ఇంకేముంది... ఆ ఫొటోలతో నెట్ వర్కింగ్ సైట్లు నిండిపోయాయి. అధ్యక్షుడి కుమార్తెలుగా ఉన్నందున ప్రజల మధ్య కనీసం కొంత సంయమనాన్ని పాటించాల్సిందని ఉచిత సలహాలు వెల్లువెత్తాయి. మీరే మీ తండ్రికి గౌరవం ఇవ్వకుంటే ప్రజలు ఎలా ఇస్తారంటూ ప్రశ్నలు వచ్చాయి.