: మరోసారి అదరగొట్టిన బాలకృష్ణ
'మేము సైతం'లో తొలుత పాట పాడి అలరించిన బాలకృష్ణ తరువాత ఓ సూపర్ స్కిట్ ప్రదర్శించి అదరగొట్టారు. పురాణ పాత్రల మధ్య సంబంధాలను అడిగి, వాటికి జవాబులు ఇస్తూ, కృత, త్రేత, ద్వాపర యుగాలను కలుపుతూ చెప్పిన డైలాగ్స్ సభికులచే 'వారేవా' అనిపించాయి. అంతకుముందు ఎం.ఎస్.నారాయణ ప్రదర్శించిన లఘు నాటిక హాస్యపు జల్లులను కురిపించింది.