: నటి జూలీ గెయట్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రేమాయణం!
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలాండే, హాలీవుడ్ నటి జూలీ గెయిట్ ల మధ్య ప్రేమాయణం ఫ్రాన్స్‌ను ఊపేస్తోంది. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్‌లో హోలాండే-గెయిట్ పక్కపక్కనే కూర్చున్న ఫొటోలు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో విహారం చేస్తున్నాయి. వీరి ఫోటోలు బహిర్గతమైన విషయంలో అధ్యక్ష భవనానికి చెందిన ఐదుగురు సిబ్బందిపై బదిలీ వేటు పడింది. హోలాండే, గెయిట్ మధ్య సంబంధం కొనసాగుతున్నట్టు గత జనవరిలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కగా, ఇప్పుడు వాయిస్ మ్యాగజీన్ వీరు కలిసున్న చిత్రాలను ప్రచురించింది.