: అనంతపురంలో పేలుడు, 12మందికి గాయాలు


చలిమంటలో వేసిన ఓ బ్యాగ్ పేలడంతో 12 మందికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరిలో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నిరుపయోగమైన వస్తువులను మంటల్లో వేసి చలికాచుకుంటుండగా, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. బ్యాగ్ లో ఉండిపోయిన దీపావళి బాణసంచా ఈ పేలుడుకు కారణమని భావిస్తున్నారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News