: యమునా, శారదా నదుల అనుసంధానం... మోదీ కొత్త ప్లాన్


భారత్, నేపాల్ సరిహద్దుల్లో ప్రవహించే శారదా నదిలో వృథాగా పోయే నీటిని వినియోగించుకునే దిశగా మోదీ ఓ కొత్త ప్లాన్ ప్రతిపాదించారు. శారదా నది నుంచి ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ ల మీదుగా ఢిల్లీ సమీపంలో యమునా నది వరకు కాలువ నిర్మించాలన్నది ఆయన అభిమతం. ఇదే విషయాన్ని సార్క్ సమావేశాల సమయంలో నేపాల్ ప్రధాని కోయిరాలాతో సైతం మోదీ చర్చించారు. ఈ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News