: ఉత్సాహంగా 10 కే రన్... ప్రారంభించిన మిల్కాసింగ్
గత 12 సంవత్సరాలుగా జరుగుతున్న హైదరాబాద్ 10 కే రన్ ఆదివారం ఉదయం ఉత్సాహభరిత వాతావరణంలో మరోసారి ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. వందలాది మంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్కాసింగ్ మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయడంవల్ల మరింత కాలం పాటు ఆరోగ్యంతో ఉండవచ్చని తెలిపారు. హైదరాబాదుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు మిల్కాసింగ్ ఆటోగ్రాఫ్ ను తీసుకునేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.