: జనవరి 1న వైకుంఠ ఏకాదశి... 1.25 లక్షల మందికి దర్శన ఏర్పాట్లు: టీటీడీ
అత్యంత ముఖ్యమైన హిందూ పర్వదినాల్లో ఒకటైన వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల నూతన సంవత్సరాది ఒకేసారి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేయనుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కనీసం 1.25 లక్షల మందికి దర్శనం చేయిస్తామని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ రెండు రోజుల్లో 37 గంటల పాటు స్వామివారి దర్శనం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనాలను నిలిపివేస్తామని తెలిపారు.