: విమానం టైరులో పొగలు...కోల్ కతాలో అత్యవసర ల్యాండింగ్!


133 మంది ప్రయాణికులతో నాగాలాండ్ లోని దిమాపూర్ విమానాశ్రయం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎయిర్ ఇండియా విమానం గమ్యం చేరకముందే అత్యవసరంగా కిందకు దిగింది. గాలిలో ఉండగానే విమానం టైరు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టైరు నుంచి పొగ వస్తున్న విషయాన్ని పైలట్, గ్రౌండ్ ఇంజినీర్ కు చేరవేశారు. విమానాన్ని సమీపంలోని కోల్ కతా విమానాశ్రయంలో అత్యవసరంగా దించేయాలన్న గ్రౌండ్ ఇంజినీర్ సలహా మేరకు పైలట్ విమానాన్ని కోల్ కతాలో దించేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News