: మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు...39 మందికి అస్వస్థత


మధ్యప్రదేశ్ లో ఓ రసాయనాల ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు వెలువడిన ఘటనలో 39 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అధికారులు, తీవ్ర అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన భోపాల్ లోని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలోని రైసెస్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ నుంచి క్లోరిన్ వాయువు లీకైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. గతంలో భోపాల్ కార్బైడ్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో ఈ ఘటనపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News