: రసాభాసగా గ్రేటర్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు!


తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ విపత్కర పరిస్థితికి మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలే కారణమంటూ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు ఇప్పుడప్పుడే ముగిసేలా లేవు. శనివారం కూడా ఈ తరహాలోనే ఓ ఘటన నమోదైంది. పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన కార్యక్రమం రసాభాసగా ముగిసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పై కార్యకర్తలు విరుచుకుపడ్డారు. సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయనను అడ్డుకున్న కార్యకర్తలు ఆయన వైఖరిని నిరసిస్తూ వాగ్వివాదానికి దిగారు. దీంతో షాక్ తిన్న దానం నాగేందర్ కూడా కార్యకర్తలతో వాదులాట కొనసాగించారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం అర్ధాంతరంగా ముగిసింది.

  • Loading...

More Telugu News