: పోలవరం వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టంలేదు: వెంకయ్య


కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టంలేదని అన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా 154 రెవెన్యూ గ్రామాలు, 9 మండలాలు ముంపునకు గురవుతాయని చెప్పారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా కొంతమందికి ఇబ్బంది తప్పదని అభిప్రాయపడ్డారు. పదిమందికి ఉపయోగపడే పని వల్ల ఒకరిద్దరికి కష్టం కలగవచ్చని అన్నారు. విభజన విధానాల విషయంలో కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరించిందని వెంకయ్య ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఇక, నదుల అనుసంధానంలో భాగంగా వృథాగా పోతున్న జలాలను వినియోగించుకోవాలని సూచించారు. వరద జలాలను మళ్లించగలిగితే 16 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని, రాయలసీమకు 45 టీఎంసీల నీరు అందించవచ్చని వివరించారు. గోదావరి జలాల నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News