: పాకిస్థాన్... భారత్ కు పొరుగు దేశం మాత్రమే: వీకే సింగ్


పాకిస్థాన్ పై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించారు. పాక్... భారత్ కు మిత్ర దేశం కాదని, పొరుగు దేశం మాత్రమేననీ అన్నారు. ఫరూఖాబాద్ లో ఓ సైనిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. "పాక్ కేవలం పొరుగు దేశం మాత్రమే. పొరుగు దేశాలన్నింటితోనూ భారత్ మంచి సంబంధాలు కోరుకుంటోంది. కానీ, భద్రతా నేపథ్యంలో కాదు" అని అన్నారు. అయితే, తమ పొరుగు దేశంతో ఏ రకమైన సంబంధాన్ని పాక్ కావాలనుకుంటుందో ఓసారి ఆలోచించుకోవాలని సింగ్ సూచించారు. పాక్ తో సుహృద్భావ సంబంధాన్ని మన దేశం కోరుకుంటోందని, భవిష్యత్తులో దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News