: శ్రీనగర్ లాల్ చౌక్ లో గ్రెనేడ్ పేలుడు
జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లా లాల్ చౌక్ ప్రాంతంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ మధ్యాహ్నం జరిగిన ఘటనలో ఏడుగురు స్థానికులకు గాయాలయ్యాయి. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. లాల్ చౌక్ ఇక్కడి అత్యంత రద్దీ ప్రాంతం. అయితే, లాల్ చౌక్ వద్ద సీఆర్పీఎఫ్ బంకర్ లక్ష్యంగానే ఈ గ్రెనేడ్ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.