: ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్టు టీఎస్ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఉద్యోగులందరికీ తెలంగాణ వచ్చిన సందర్భంగా స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చామని... అదే రీతిలో ఆర్టీసీ కార్మికులకు కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఇంక్రిమెంట్ భారాన్ని ఆర్టీసీ భరించాల్సిన అవసరం లేదని... ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో 80 ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయమని స్పష్టం చేశారు. మహిళా కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని రవాణాశాఖ కమిషనర్, డీఎంలను ఆదేశించారు.

  • Loading...

More Telugu News